విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రలలో సిఎస్ గంటా దర్శకత్వంలో వైవిద్యభరితమైన కథతో ‘విక్కి ది రాక్ స్టార్’ అనే పేరుతో ఓ డిఫరెంట్ మూవీ రూపొందుతోంది. హై ప్రొడక్షన్ వాల్యూస్ జోడించి శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి(IAF) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి వినాయక చవితి సందర్భంగా ఓ అప్డేట్ వచ్చింది. విక్కీ ది రాక్ స్టార్ నుంచి ఇదివరకు విడుదల చేసిన ఫస్ట్ షేడ్, లవ్ షేడ్‌లకు మంచి స్పందన వచ్చింది. పిల్లా నువ్వు నాకు ప్రాణమే అనే పాట కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు పండుగ సందర్భంగా ఓ ఆహ్లాదకరమైన పాటను విడుదల చేశారు మేకర్స్. ‘పోదాం వెళ్లిపోదాం’ అంటూ సాగే ఈ పాటను విడుదల చేశారు. ఈ పాటలో హీరో హీరోయిన్లు, వారి స్నేహితులు కలిసి వేస్తున్న ట్రిప్స్, వాటి లొకేషన్లను అందంగా చూపించారు. ముఖ్యంగా ఈ పాటలోని లొకేషన్లు మాత్రం అందరినీ కట్టిపడేసేలా ఉన్నాయి. సునీల్ కశ్యప్ అందించిన బాణీ.. విశ్వనాథ్ కాసర్ల సాహిత్యం, విష్ణుప్రియ గాత్రం అద్భుతంగా కుదిరాయి. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా గ్రాండ్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచాలనేది మేకర్స్ ప్లాన్. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఎవ్వరూ చేయని జానర్‌ని టచ్ చేస్తూ ఈ సినిమా రూపొందించారని ఇప్పటికే వదిలిన అప్డేట్స్ తెలుపుతున్నాయి.