ఏప్రిల్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్”

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” సినిమా రిలీజ్ డేట్ ను ఇవాళ మూవీ టీమ్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నట్లు అఫీషియల్ గా వెల్లడించారు. “ఫ్యామిలీ స్టార్” సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. “ఫ్యామిలీ స్టార్” చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు.

“ఫ్యామిలీ స్టార్” సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ లా కనిపిస్తున్నారు. లుంగీ కట్టుకుని గన్నీ బ్యాగ్, ఆధార్ కార్డ్ తో విజయ్ నడిచి వస్తున్న పోస్టర్ చూడగానే ఆకట్టుకుంటోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “ఫ్యామిలీ స్టార్” సినిమా థియేటర్స్ లో ఎంజాయ్ చేసేందుకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు

టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్
సంగీతం : గోపీసుందర్
ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా, వంశీ కాక
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ
నిర్మాతలు : రాజు – శిరీష్
రచన, దర్శకత్వం – పరశురామ్ పెట్ల

Related Posts

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, రామ్ ఆచంట, గోపీ ఆచంట,14 రీల్స్ ప్లస్, ఎమ్ తేజస్విని నందమూరి ప్రెజెంట్స్ #BB4 ‘అఖండ 2: తాండవం’ బ్రెత్ టేకింగ్ ఫైట్ సీక్వెన్స్ తో రెగ్యులర్ షూట్ ప్రారంభం- 25-09-25న దసరాకి థియేట్రికల్ రిలీజ్

Latest News Updates

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, రామ్ ఆచంట, గోపీ ఆచంట,14 రీల్స్ ప్లస్, ఎమ్ తేజస్విని నందమూరి ప్రెజెంట్స్ #BB4 ‘అఖండ 2: తాండవం’ బ్రెత్ టేకింగ్ ఫైట్ సీక్వెన్స్ తో రెగ్యులర్ షూట్ ప్రారంభం- 25-09-25న దసరాకి థియేట్రికల్ రిలీజ్