వైవిధ్యమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్న హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “లవ్ గురు”. ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న చిత్రమిది. “లవ్ గురు” సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా “లవ్ గురు” సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 11న విడుదల చేయబోతున్నారు. ఇవాళ “లవ్ గురు” సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
నటీనటులు – విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి, వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ – ఫరూక్ జే బాష
సంగీతం -భరత్ ధనశేఖర్
ఎడిటింగ్, నిర్మాత – విజయ్ ఆంటోనీ
బ్యానర్ – విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్
సమర్పణ – మీరా విజయ్ ఆంటోనీ
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా
రచన దర్శకత్వం – వినాయక్ వైద్యనాథన్












