టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ డెబ్యూ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం చాలా అరుదుగా జరిగింది. కథ ఎంతో స్ట్రాంగ్ గా ఉంటే తప్పించి వెంకీ నుంచి వారికి గ్రీన్ సిగ్నల్ రాదు. అలా ఛాన్స్ లు అందుకున్న వారిలో ప్రేమించుకుందాం రా డైరెక్టర్ జయంత్ సి పరాంజీ ఒకరు. గణేష్ డైరెక్టర్ తిరుపతి స్వామి ఒకరు. ఆ తర్వాత మళ్లీ వెంకీ ఇప్పటివరకు కొత్త డైరెక్టర్లకు ఛాన్సిచ్చింది లేదు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వెంకీ ఓ కొత్త రచయితకు డైరెక్టర్ గా పనిచేసే అవకాశమిచ్చినట్లు తెలుస్తోంది. సామజవరగమన సినిమాకు రచయితలుగా పనిచేసిన నందు రీసెంట్ గా సురేష్ బాబు, వెంకటేష్ కు ఒక కథ చెప్పి ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ ఇప్పుడు రానా నాయుడు సీజన్2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. జులై ఫస్ట్ వీక్ లో దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి సినిమా మొదలుకానుంది. 5 నెలల్లో సినిమాను పూర్తి చేసి 2025 సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లానింగ్ తో ఈ సినిమాను చేస్తున్నారు. నందు ఫైనల్ నెరేషన్ తో మెప్పిస్తే అనిల్ రావిపూడి తర్వాత సినిమా వెంకీ తనతోనే చేసే ఛాన్సుంది. వెంకీకి నందు చెప్పిన కథ మల్లీశ్వరి తరహాలో ఫుల్ ఎంటర్టైనింగ్ అని తెలుస్తోంది.