కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేద’. భయం అంటే తెలియని వ్యక్తి కథాంశమే వేద సినిమా. ఇప్పటి వరకు ఆయన నటించనటువంటి ఔట్ అండ్ ఔట్ మాసీ పాత్రలో సందడి చేశారు. అమ్మాయిలపై అకృత్యాలు చేసే మృగాళ్లు చట్టం ఏమీ చేయలేప్పుడు హీరో ఏం చేశాడు.. మహిళల విషయంలో తప్పు చేసే మగవాళ్లకు ఎలాంటి శిక్షలను విధిస్తే సమాజంలో మార్పు వస్తుందనే విషయాన్ని ఇన్టెన్స్ కోణంలో ‘వేద’ సినిమాతో ఆవిష్కరించారు.
హీరో శివ రాజ్‌కుమార్ పాత్ర మాత్రమే కాదు.. సినిమాలో మహిళల పాత్రలు కూడా ఆయనకు ధీటుగా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు. శివ రాజ్‌కుమార్‌తో పాటు లేడీస్ చేసిన అద్భుతమైన యాక్షన్ సీన్స్ చూస్తే గూజ్బమ్స్ రావటం పక్కా. ఇంతకు ముందెన్నడూ రాని విధంగా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. రీసెంట్గా థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ చానెల్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా చూసిన ఆడియెన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. థియేటర్స్ కంటే జీ 5లో వేద సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠి, గుజరాతి, బెంగాళి సహా పలు భాషల్లో ఆడియెన్స్‌కు వైవిధ్యమైన కంటెంట్ అందిస్తోంది జీ 5. ఇంత కంటెంట్‌ను మరో డిజిటల్ మాధ్యమం అందించటం లేదంటే అతిశయోక్తి కాదు. జాతీయ స్థాయిలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న జీ 5 ఓ ట్రాక్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. తాజాగా జీ 5 సంస్థ లైబ్రరీలో మరో సినిమాగా వేద సినిమా చేరింది. ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో వేద సినిమా జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది.
శివ రాజ్‌కుమార్ 125వ చిత్రం ‘వేద’. ఆయన కెరీర్లోనే ఇది స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ అనే బ్యానర్‌పై రూపొందించారు. హర్ష ఈ చిత్రాన్ని తెరకెక్కించారు . అర్జున్ జన్యా సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రానికి స్వామి జె.గౌడ సినిమాటోగ్రఫీ అందించారు.
నటీనటులు:
శివ రాజ్‌కుమార్, భరత్ సాగర్, గణవి లక్ష్మణ్, శ్వేతా చెంగప్ప, ఉమాశ్రీ, అదితి సాగర్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
ఓటీటీ: జీ 5
బ్యానర్: గీతా పిక్చర్స్
నిర్మాత: గీత శివ రాజ్‌కుమార్
దర్శకత్వం: హర్ష
సినిమాటోగ్రఫీ: స్వామి జె.గౌడ
సంగీతం: అర్జున జన్యా
ఎడిటింగ్: దీపు ఎస్.కుమార్