విదుతలై చిరుతైగల్ కట్చి పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ (వీసీకే) వామపక్ష నేతలతో భేటీ అయ్యారు. ఏపీ సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ కృష్ణతో పాటు నారాయణతో కూడా భేటీ అయ్యారు. మున్ముందు దళితుల విషయంలో వామపక్షాలతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధమని ప్రకటించారు.

 

మరోవైపు తిరుమావళవన్ సీఎం కేసీఆర్ తో కూడా భేటీ అయ్యారు. దళితుల విషయంలో తెలంగాణలో అమలవుతున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక… తమ పార్టీ విదుతలై చిరుతైగల్ కట్చి కేసీఆర్ నూతనంగా ప్రకటించిన బీఆర్ఎస్ లో విలీనం అవుతుందన్న వార్తలను తిరుమావళై ఖండించారు. ఆ వార్తలు సత్యదూరమన్నారు. అయితే.. బీఆర్ఎస్ కు అంశాల వారీగానే తాము మద్దతిస్తామని, విలీనం ప్రసక్తి లేదని తిరుమావళవన్ తేల్చి చెప్పారు.

 

ద్రవిడ దేశం వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణారావు కూడా సీఎం కేసీఆర్ ని కలిసి, తమ పార్టీ తరఫున మద్దతు తెలిపారు. తమ పార్టీ కూడా బయట నుండే బిఆర్ఎస్ కు మద్దతు తెలుపుతుందని,  దేశ వ్యాప్త దళిత సదస్సుల్లో సీఎం కేసీఆర్ తో పాటు తాను, తిరుమావళవన్  తమ తమ పార్టీల తరఫున పాల్గొంటామని ప్రపంచతెలుగు. కామ్ ప్రతినిధికి తెలియచేసారు.