‘‘అది జరిగే పని కాదు” లౌక్యంగా సమాధానం చెప్పిన నిర్మాత అల్లు అరవింద్

తమిళ్ హీరో విజయ్ నటించిన  వారసుడు (వారిసు) సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్  చేయబోతున్నట్ల ప్రొడ్యూసర్ దిల్‌రాజు  ఇప్పటికే ప్రకటించేశారు. సినిమా విడుదల వివాదం  పై అల్లు అరవింద్ చాలా లౌక్యంగా స్పందించారు. ఇది  ఒకే ఒక్క మాటతో అది జరిగే వ్యవహారం కాదని తేల్చి చెప్పేశారు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ దిల్‌రాజు కాగా,  కానీ సంక్రాంతికి తెలుగు సినిమాలకే ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలంటూ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి  ఇటీవల ఘాటుగా డిస్ట్రిబ్యూటర్స్‌కి లేఖ రాసింది. దాంతో తమిళ్ డబ్బింగ్ సినిమాగా రాబోతున్న వారిసు మూవీ తెలుగులో సంక్రాంతికి రిలీజ్‌ అవడంపై సందిగ్ధత నెలకొంది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇలా తమిళ్ సినిమాని సంక్రాంతికి అడ్డుకోవాలని ప్రయత్నిస్తుండటంపై తమిళ్ ప్రొడ్యూసర్స్ మండిపడుతున్నారు. తెలుగు సినిమాల్ని ఇక్కడ అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. దాంతో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా పునరాలోచనల్లో పడినట్లు వార్తలు వస్తున్నాయి. వారిసు సినిమాని దిల్‌రాజు నిర్మిస్తుండగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో విజయ్‌కి జోడీగా రష్మిక మందన నటిస్తోంది. అలానే, ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్, సంగీత కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. వాస్తవానికి 2019లో దిల్ రాజు ఈ రూల్‌ని స్వయంగా తెరపైకి తెచ్చారు. ఆ ఏడాది సంక్రాంతికి తెలుగు సినిమాలు ఉండగా డబ్బింగ్ సినిమాలకి థియేటర్లు ఎలా ఇస్తారు? అని మీడియా ముందు మండిపడ్డారు. ఆ విషయాన్ని కూడా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆ లేఖలో పేర్కొనడం విశేషం. వరుణ్‌ ధావన్‌, కృతిసనన్ జంటగా నటించిన‘భేడియా’ సినిమా తెలుగులో ‘తోడేలు’ పేరుతో నవంబర్ 25న రిలీజ్ అవుతోంది. ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత అల్లు అరవింద్‌  సమర్పిస్తున్నారు. దాంతో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి అల్లు అరవింద్ హాజరవగా.. అతనికి సినీ జర్నలిస్ట్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. ‘‘ఇండియన్ సినిమా ఇప్పుడు అంతా ఒక్కటే అయిపోయింది. ఈ సమయంలో సంక్రాంతికి కేవలం తెలుగు సినిమాలకే థియేటర్లు ఇవ్వాలని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లేఖ రాయడంపై మీరేంటారు?’’ అని ప్రశ్నించగా ‘‘అది జరిగే పని కాదు’’ అని ఒక్కమాటతో తేల్చేశారు.

Related Posts

Latest News Updates