హిందువుల తరపు పిటిషన్ ను స్వీకరించిన వారణాసి కోర్టు.. చారిత్రాత్మక తీర్పునిచ్చిన వారణాసి కోర్టు

జ్ఞానవాపి కేసుపై వారణాసి కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. మసీదు ఆవరణలోని శృంగార గౌరీ ప్రతిమకు పూజలు చేసేందుకు అనుమతించాలని హిందూ సంఘాలు వేసిన పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ తీర్పును హిందూ సంఘాలు స్వాగతించాయి. ఇక…హిందువుల పిటిషన్‌ను సవాలు చేస్తూ అంజుమన్ ఇంతజామియా వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 22 వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని అంజుమ్ ఇంతజామియా కమిటీ ప్రకటించింది. పిటిషన్ విచారణకు యోగ్యమైనదిగా కోర్టు భావించి, ముస్లింల తరపు వాదనను కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 22 న జరుగుతుంది అని హిందువుల తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ప్రకటించారు.

 

 

మసీదు ప్రాంగణంలో విగ్రహాల విషయమై విచారణే అవసరం లేదని, దీనిపై కొంతమంది చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని అంజుమన్ ఇంతెజామియా కమిటీ అఫిడవిట్ దాఖలు చేసింది. మసీదుకు సంబంధించిన స్థలం సహా మిగిలిన ఆస్తులు పూర్తిగా వక్ఫ్ బోర్డుకు చెందుతాయని పేర్కొంది.  మరోవైపు …. మసీదు ప్రాంగణంలోని హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ గతంలో కొందరు మహిళలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రత్యేక కమిటీ వీడియో సర్వే నిర్వహించి కోర్టుకు నివేదిక సమర్పించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి వ్యవహారం జిల్లా కోర్టు ముందు విచారణకు వచ్చింది.

Related Posts

Latest News Updates