డిసెంబర్ 31 న విడుదల కాబోతున్న వరలక్ష్మి శరత్ కుమార్ ‘చేజింగ్’ చిత్రం

క్రాక్, నాంది, యశోద సినిమా లతో ప్రేక్షకులను అలరించి మంచి గుర్తింపు సంపాదించుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. తన పాత్రలో వైవిధ్యత ఉండేలా చూసుకుంటూ స్టార్ నటిగా ఎదుగుతున్న వరలక్ష్మి నటిస్తున్న తాజా చిత్రం ఛేజింగ్.

సీనియర్‌ హీరో శరత్‌ కుమార్‌ కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసి వెండితెరపై తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ విభిన్నమైన పాత్రలతో స్పెషల్ క్రేజ్ అందుకుంది. పాజిటివ్ రోల్స్ తో పాటు నెగిటివ్ రోల్స్ కూడా చేస్తూ  తమిళ, తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీ చేంజింగ్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది  వరలక్ష్మి శరత్ కుమార్.

ఈ సినిమాకు  కె. వీరకుమార్‌ దర్శకత్వం వహించగా మదిలగన్‌ మునియాండి నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు లో  శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌ పతాకం పై ఏఎన్ బాలాజీ ఈ సినిమా ను విడుదల చేస్తున్నారు. తాషి సంగీతం సమకూర్చగా ఈ సినిమా కి E కృష్ణస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ఇప్పటికే తమిళంలో మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమా ను తెలుగు లో డిసెంబర్ 31 వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ మేరకు మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Related Posts

Latest News Updates