విశాఖలో వందే భారత్ ఎక్స్ ప్రెస్… చూసేందుకు ప్రయాణికుల ఆసక్తి

తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు విశాఖకు చేరుకుంది. టెస్ట్ డ్రైవ్ లో భాగంగా చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీ నుంచి విశాఖ రైల్వేస్టేషన్ కు చేరుకుంది. మొత్తం 16 బోగీలతో వున్న ఈ రైలును చూసేందుకు ప్రయాణికులు ఆసక్తిచూపారు. తొలుత దీన్ని సికింద్రాబాద్‌-విజయవాడ మధ్య నడపాలని ప్రతిపాదించినా.. ఆ తర్వాత విశాఖట్నం వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదుగా వర్చువల్‌గా ప్రారంభమయ్యే ఈ రైలును తొలుత ట్రయల్‌ రన్‌ కోసం చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ నుంచి విశాఖపట్నం పంపించారు. విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య ప్రయాణ దూరం 700 కి.మీ. కాగా, ఈ రైలు కేవలం 8.40 గంటల్లోనే గమ్యస్థానం చేరుస్తుందని విశాఖ రైల్వేస్టేషన్‌ సూపరింటెండెంట్‌ సురేశ్‌ తెలిపారు. ఈ రైలును గంటకు 160 కి.మీ. వేగంతో నడపొచ్చని చెప్పారు.

Related Posts

Latest News Updates