వాల్తేరు వీరయ్య సెకండ్ సింగిల్ సాంగ్ రిలీజ్…

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. దీనికి సంబంధించి… దాదాపుగో రోజు విడిచి రోజు ఏదో ఒక అప్ డేట్ వస్తూనే వుంది. తాజాగా… సినిమాలోని సెకండ్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘నువ్వు సీతవైతే నేను రాముడినంటా..నువ్వు రాధావైతే నేను కృష్ణుడినంటా’ అంటూ సాంగ్ మొదలైంది. చివరిలో ‘నువ్వు శ్రీదేవి అయితే.. ఆ అయితే.. ? నేనే చిరంజీవంటా’ అంటూ సాంగ్ ముగిసింది. జస్ప్రీత్ జాస్జ్, సమీరా భరద్వాజ్ ఈ పాటను ఆలపించారు. అందమైన మంచుకొండల నడుమ ఈ సాంగ్ ను చిత్రీకరించారు. స్టైలిష్ గా కనిపిస్తున్న చిరు అదిరిపోయే స్టెప్పులేశారు. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశారు. ఈ సినిమాలో రవితేజ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 13న సంక్రాంతి కానుకగా ‘వాల్తేరు వీరయ్య’ మూవీ విడుదల కానుంది.

Related Posts

Latest News Updates