బిగ్ బాస్ మానస్ నాగులపల్లి, అమర్ దీప్ చౌదరి చేతుల మీదగా హైదరాబాద్ లో తొలిసారిగా ‘ఉత్సవ్ – ది స్వీట్స్ కేఫ్ & లైవ్ కిచెన్ ప్రారంభం.

హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ లో ఉత్సవ్ – ది స్వీట్స్ కేఫ్ & లైవ్ కిచెన్ ప్రారంభమైంది. దీనికి ముఖ్య అతిథులుగా బిగ్ బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి, అమరదీప్ చౌదరి హాజరై ఘనంగా ప్రారంభించారు. కాకినాడకు చెందిన సూర్య, హైదరాబాద్ కు చెందిన శ్రావణి అనే ఇద్దరు మిత్రులు కలిసి అతి చిన్న వయస్సులోనే తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అనే ఉద్దేశంతో ఈ ఉత్సవ్ అనే లైవ్ కిచెన్ ను ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్బంగా బిగ్ బాస్ ఫేమ్ నటుడు అమర్ దీప్ చౌదరి మాట్లాడుతూ… “ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. మీ అందరూ ఈ బిజినెస్ ని సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను. నేను స్వీట్స్ ఎంతో ఇష్టపడతాను. నేను ఎక్కువగా కజ్జికాయలు ఇష్టంగా తింటాను. ఉత్సవ్ ఓపెనింగ్ ఫంక్షన్ కూడ ఒక చిన్న సినిమా ఆడియో లాంఛ్ లా చేయడం నాకు ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మన కళ్ళ ముందే స్వీట్స్ తయారు చేసి ఇవ్వడం అనేది మరొక చెప్పుకోదగిన విషయం. చాల చిన్న వయసులోనే వీరు ఇలా ఒక బిజినెస్ మొదలు పెట్టడం అనేది నిజంగా గొప్ప విషయం. ఇలాంటి బ్రాంచ్లు ఇంకా ఎన్నో పెట్టాలి, మరింత ఎత్తుకు ఎదగాలి అని కోరుకుంటున్నాను.

మానస్ నగులపల్లి మాట్లాడుతూ… “ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ ఉత్సవ్ గురించి నేను నా స్నేహితులకు, నా సర్కిల్ లో ఉన్న వారు అందరికీ చెప్తాను. ఇక్కడ స్వీట్స్ చాల బాగున్నాయి. పూతరేకులు నాకు ఇష్టమైన స్వీట్. ఉత్సవ్ ఎంతో సక్సెస్ కావాలి. ఇటువంటి ఎన్నో బ్రాంచ్ లు స్థాపించాలి, జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలి అని కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి సినిమాలు అయితే ఏమి లేవు, సీరియల్ లోనే చేస్తున్నాను” అన్నారు.

సూర్య మాట్లాడుతూ… “తొలిసారిగా హైదరాబాద్ లో లైవ్ కిచెన్ పెడుతున్నాం. మీ సపోర్ట్, ఆశీర్వాదాలు మాకు ఉండాలి అని కోరుకుంటున్నాం. ప్రజలు అందరూ మా స్వీట్స్ క్వాలిటీను గమనిస్తారు అని అనుకుంటున్నాను. అందుకోసమే నేను, శ్రావణి కలిసి ఈ బిజినెస్ స్టార్ట్ చేశాం ” అన్నారు.

శ్రావణి మాట్లాడుతూ…”మీరంటే నాకు ఎంతో అభిమానం. బిగ్ బాస్ కు వెళ్ళడానికి ముందు మీరు కొన్ని సీరియల్స్ లో నటించేవారు. నేను మీకు అప్పటి నుండి అభిమానిని. మీ ఆశీర్వాదాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజలకు నాణ్యమైన స్వీట్స్ అందేలా చేయడమే మా లక్ష్యం. అందుచేతనే సూర్యతో కలిసి ఈ లైవ్ కిచెన్ బిజినెస్ మొదలుపెట్టడం జరిగింది” అన్నారు.

Related Posts

Latest News Updates