కె.వి. నువ్వాకలి, మన్మథ మరియు మలీశ్వరి వంటి స్వచ్ఛమైన కుటుంబ వినోద చిత్రాల వెనుక ఉన్న ప్రముఖ దూరదృష్టి గల విజయభాస్కర్, మారో లవ్ యొక్క తాజా వినోదాత్మక చిత్రం, లవ్ ఈజ్ కేర్‌ఫుల్. కె విజయభాస్కర్ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకమల్, తన్వి ఆకాంక్ష మరియు సూర్య ప్రధాన పాత్రలు పోషించారు. ఆగస్ట్ 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కుతోందని ప్రశంసలు అందుతున్నాయి. ఈ సందర్భంగా చిత్ర విభాగం విజయోత్సవ సభను ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత విజయభాస్కర్ మాట్లాడుతూ ‘చాలా రోజుల తరువాత ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను చూశామని ప్రేక్షకులు అంటుంటే ఆనందంగా వుంది. నువ్వు నాకు నచ్చావ్ తరహాలో వినోదంతో పాటు నువ్వేకావాలి లాంటి టీనేజ్ లవ్‌స్టోరీ ఈ చిత్రంలో వుందని అందరూ అంటున్నారు. చిత్రాన్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మౌత్‌టాక్‌తో ఇది మరింత మందికి చేరువ అవుతుందని నమ్మకం వుంది. కలెక్షన్లు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఇలాంటి చిన్న సినిమాలను ఆదరిస్తే మరిన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్లు వస్తాయి. ఈచిత్రంతో హీరో, హీరోయిన్లకు నాకంటే ఎక్కువ పేరు వచ్చింది’ అన్నారు.
హీరో శ్రీకమల్ మాట్లాడుతూ సినిమా చూసిన అందరూ నా నటన, డ్యాన్సుల గురించి మాట్లాడుతున్నారు. అందరం ఎంతో కష్టపడి సినిమా చేశాం. ఈ రోజు ఫలితం చూస్తుంటే ఎంతో ఆనందంగా వుంది. కలెక్షన్లు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నాం’ అన్నారు. హీరోయిన్ తాన్వీ ఆకాంక్ష మాట్లాడుతూ సినిమా ప్రివ్యూ చూసిన అందరి నుండి చాలా పాజిటివ్ స్పందన వచ్చింది. ఓ మంచి చిత్రంలో హీరోయిన్గా నటించినందుకు సంతోషంగా వుంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు విజయ్‌భాస్కర్ గారికి థ్యాంక్స్’ అన్నారు.
సినిమా చూసిన తరువాత చాలా రోజుల తరువాత మంచి సంగీతంతో కూడిన పాటలు చూశామని ఎమోషన్‌గా చెబుతుంటే నాకు ఎంతో గర్వంగా వుంది. ఈచిత్రంలో ప్రతి పాటకు చక్కని సాహిత్యం, ట్యూన్స్ కుదిరాయి. నా కెరీర్లో ఇదొక మరుపురాని చిత్రంగా నిలుస్తుందని సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధ్రువన్ తెలిపారు.