అల్లు శిరీష్ హీరో గా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సక్సెస్ మీట్ ని రేపు ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ ఈవెంట్‌కి అల్లు అర్జున్ రాబోతున్నాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ఓ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఊర్వశివో రాక్షసివో మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవ్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుని థియేటర్లలో నడుస్తోంది. దాంతో ఆ టీమ్ ఆదివారం సక్సెస్ మీట్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. ఈ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్ రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రాకేష్ శశి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లివింగ్ రిలేషన్‌షిప్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చింది. దాంతో యూత్ నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు చిత్ర యూనిట్ చెప్తోంది. మరీ ముఖ్యంగా.. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ మధ్య ఆన్‌స్క్రీన్ కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అయినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం సక్సెస్ మీట్ జరగబోతోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. గత ఏడాది విడుదలైన ‘పుష్ప- ది రైజ్’ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ ఊహించని విధంగా సక్సెస్ అయ్యింది. దాంతో కాస్త ఎక్కువ టైమ్ తీసుకుని దర్శకుడు సుకుమార్ పూర్తి స్థాయిలో స్క్రిప్ట్‌ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పుష్ప-2 మూవీ వచ్చే ఏడాది రిలీజ్‌కానుంది.