వేషాలు, రూపాలు మార్చుకొని అర్బన్ నక్సల్స్ వస్తున్నారు.. జాగ్రత్త.. మోదీ హెచ్చరికలు

అర్బన్ నక్సల్స్ వేరే వేరే రూపాలతో గుజరాత్ లో ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కానీ… యువకుల భవిష్యత్తును నాశనం చేసే అర్బన్ నక్సల్స్ ను గుజరాత్ లో ప్రవేశించనీయమని తేల్చి చెప్పారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బరూచ్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆప్ పై పరోక్షంగా మండిపడ్డారు. వేషాలను మార్చుకొని, గుజరాత్ లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని, కానీ.. వారిని అనుసరించొద్దని మోదీ పిలుపునిచ్చారు.

 

 

అర్బన్ నక్సల్స్ వల్లే నర్మదా సరోవర్ డ్యామ్ నిర్మాణం 50 ఏళ్ల సమయం వృథా అయ్యిందని మండిపడ్డారు. వివిధ ప్రయత్నాల తర్వాత ఈరోజు సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణం పూర్తయిందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్బన్ నక్సల్స్ ను ప్రవేశించనీయవద్దని, అటు వైపు వెళ్లొద్దని, యువకులకు ఉద్బోధించాలని ప్రధాని మోదీ సూచించారు. వీరి వల్ల దేశం విధ్వంసం అవుతోందని తీవ్రంగా విరుచుకుపడ్డారు.

Related Posts

Latest News Updates