రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రెగ్నెన్సీ అని ప్రకటన వచ్చిన తర్వాత… మొదటి సారిగా ఓ ట్వీట్ చేశారు. ప్రెగ్నెన్సీ సందర్భంగా ఆమె తన పుట్టింటికి వెళ్లింది. తన జీవితంలోని మధుర క్షణాలను తాను ఎంతగానో ఆస్వాదిస్తున్నానని అన్నారు. అయితే..తన అత్తమ్మ సురేఖను తాను ఎంతో మిస్ అవుతున్నానని ట్వీట్ చేసింది. అందరి ఆశీస్సులతో జీవితంలో ఎంతో ముఖ్యమైన మాతృత్వంలోని అడుగుపెట్టబోతున్నా… ఈ సమయంలో నేను అత్తమ్మను ఎంతో మిస్ అవుతున్నా అంటూ ట్వీట్ చేశారు. ఇక… తల్లి శోభనా కామినేని, అమ్మమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తాను దిగిన ఫొటోను ఉపాసన షేర్ చేశారు.
https://twitter.com/upasanakonidela/status/1603384547756109824?s=20&t=dJuz7XH3jvWd1rzj_gjGyA












