పలు ప్రాంతాల్లో వందే భారత్ రైళ్లపై దుండగులు రాళ్లు విసరడంపై కేంద్రం స్పందించింది. ఇలాంటి చట్టవిరుద్ధ అంశాలను కొన్ని రాజకీయ పార్టీలు ప్రేరేపిస్తున్నాయని, వాటిని మానేయాలని అన్నారు. భారత్ ను అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనుకున్న ప్రధాని మోదీ దార్శనికతను రాళ్లు విసిరి ఎవ్వరూ ఆపలేరని తేల్చి చెప్పారు. భారత్ అభివృద్ధిని చూసి కుళ్లుకునేవారు, ఇష్టపడని వారే వందే భారత్ రైళ్లపై రాళ్ల దాడులకు దిగుతున్నారని, ఇందులో ప్రమేయం వున్న వారిని మాత్రం విడిచిపెట్టమని, చట్టం ప్రకారం కచ్చితంగా శిక్షిస్తామని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తేల్చి చెప్పారు. దేశీయంగా తయారైన వందే భారత్ రైళ్ల గురించి 18 దేశాల్లో చర్చలు జరుగుతున్నాయని, రానున్న రోజుల్లో వందే భారత్ రైళ్లను ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేస్తామని ప్రకటించారు.