బెంగాల్ లో టెన్షన్… కేంద్ర మంత్రి కాన్వాయ్ పై టీఎంసీ నేతల రాళ్ల దాడి

కేంద్ర మంత్రి నిసిత్ ప్రమాణిక్ కాన్వాయ్ పై దాడి జరిగింది. ఈ దాడిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్ వాహనం ముందు అద్దం పూర్తిగా ధ్వంసమైంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిసిత్ ప్రమాణిక్ స్థానిక బీజేపీ కార్యాలయానికి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అధికార టీఎంసీ కార్యకర్తలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. ఇది నడుస్తున్న క్రమంలోనే కేంద్ర మంత్రి కాన్వాయ్ పై రాళ్ల దాడి చేశారు. దీంతో పరిస్థితి విషమించింది. అక్కడే వున్న పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే ఇది పూర్తిగా టీఎంసీ నేతల పనే అని బీజేపీ మండిపడుతోంది. బెంగాల్ లో ఏకంగా ఓ కేంద్రమంత్రికే రక్షణ లేకుంటే.. సామాన్యుల గతి ఏంటని ప్రశ్నిస్తోంది.

తృణమూల్ కార్యకర్తలు ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని కేంద్రమంత్రి నిశిత్ ప్రమాణిక్ అన్నారు. అక్రమార్కులకు టీఎంసీ ఆశ్రయం ఇస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై బీజేపీ పశ్చిమ బెంగాల్ అధికార ప్రతినిధి షమిక్ భట్టాచార్య స్పందించారు. కేంద్ర మంత్రి కారుపై ఈ విధంగా దాడి జరిగితే, రాష్ట్రంలోని సామాన్య ప్రజల భద్రత గురించి ఆలోచించండి అని అన్నారు. రాష్ట్రంలో ఆర్టికల్ 355 విధించేందుకు గవర్నర్ చర్యలు ప్రారంభించాలని భట్టాచార్య డిమాండ్ చేశారు.

Related Posts

Latest News Updates