అత్యంత కీలకమైన 2023-2024 ఆర్థిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా వుందని, ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని అభివర్ణించారు. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని అభివర్ణించారు. డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయని, సమష్టి ప్రగతి దిశగా భారత్ కదులుతోందన్నారు. ఇక…. కేంద్ర బడ్జెట్ లో మన తెలుగు రాష్ట్రాలకు ఏమేమీ దక్కాయో, ఉమ్మడిగా ఏం వచ్చాయో ఒక్కసారి పరిశీలిద్దాం.
ఏపీ సెంట్రల్ యూనివర్శిటీకి 47 కోట్లు
పెట్రోలియం యూనివర్శిటీకి 168 కోట్లు
విశాఖ స్టీల్ ప్లాంట్ కి 683 కోట్లు
తెలంగాణ కేటాయింపులు
సింగరేణికి 1,650 కోట్లు
IIT హైదరాబాద్ కి 300 కోట్లు
మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు 1,473 కోట్లు
ఇక… రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు 37 కోట్లు కేటాయించారు. మంగళగిరి, బిబినగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ ఆస్పత్రులకు 6,835 కోట్లు కేటాయించారు. సాలార్జంగ్ సహా అన్ని మ్యూజియాలకు 357 కోట్లు కేటాయించారు. మొత్తంగా చూసుకుంటే కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా 41,338 కోట్లు కాగా, తెలంగాణ వాటా 21,470 కోట్లుగా వుంది.
కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ పై కీలక ప్రసంగం చేస్తున్నారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా వుందని, ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని అభివర్ణించారు. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని అభివర్ణించారు. డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయని, సమష్టి ప్రగతి దిశగా భారత్ కదులుతోందన్నారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా 11.7 కోట్లతో టాయ్ లెట్స్ నిర్మాణం చెపట్టామని, 44 కోట్ల మందికి పీఎం సురక్షా బీమా యోజన పథకాన్ని అందిస్తున్నామని వివరించారు. 220 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లను అందించామని పేర్కొన్నారు. విశ్వకర్మ కౌశల్ పథకంలో భాగంగా చేనేత కార్మికులకు చేయూత అందిస్తున్నామని, ఉచిత ఆహార ధాన్యాల పథకానికి 2 లక్షల కోట్లను కేంద్రం భరిస్తోందని ప్రకటించారు.