500 రూపాయలకే సిలిండర్… కీలక ప్రకటన చేసిన రాజస్థాన్ సర్కార్

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే యేడాది ఏప్రిల్ 1 నుంచి సిలిండర్ ధరను 500 రూపాయలకే ఇస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. దారిద్ర్య రేఖకు దిగువన వుండి.. ఉజ్వల పథకంలో పేరు నమోదు చేసుకున్న వారికి ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపారు. 500 రూపాయలకే ఏడాదికి 12 సిలిండర్లను అందజేస్తామన్నారు. వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం సన్నద్ధమవుతున్నామని తెలిపారు. ఉజ్వల స్కీంలో పేదలకు ప్రధాని మోదీ ఎల్పీజీ కనెక్షన్లు, స్టౌ ఇచ్చారని, కానీ సిలిండర్లు ఖాళీగా వున్నాయన్నారు. ఎందుకంటే సిలిండర్ ధరలు బాగా వుండటమే ఇందుకు కారణమని అన్నారు. అందుకే తాము ఈ పథకంలో నమోదు చేసుకున్న వారికి 500 రూపాలయకే సిలిండర్ అందజేస్తామని సీఎం ప్రకటించారు.

Related Posts

Latest News Updates