ముఖ్యమంత్రి చౌహాన్ ప్రభుత్వానికి.. ఉమా భారతి అల్టిమేటం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మద్యం పాలసీలో మార్పులు తీసుకురావాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి డిమాండ్ చేస్తున్నారు.  భోపాల్లోని అయోధ్య బైపాస్ రోడ్డులో ఉన్న హనుమాన్ దేవాలయానికి ఉమా భారతి  వచ్చారు. అక్కడ మీడియాతో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం పాలసీ సరిగా లేదని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇదే ఆలయంలో ఈ నెల 31 వరకు ఉంటానని, అంతలోపు మంచి వార్త వినేలా సీఎం చౌహాన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందన్నారు. డీ-అడిక్షన్ను ప్రోత్సహించేలా కొత్త మద్యం పాలసీని మార్చాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. కొత్త మద్యం పాలసీ ప్రకటించే వరకు ఇక్కడే ఉంటానని చెప్పారు. మద్యం పాలసీలో మార్పులు తెస్తేనే మళ్లీ రికార్డు స్థాయి విజయం సొంతం చేసుకుంటామని, లేదంటే అంతే సంగతులని ముఖ్యమంత్రి చౌహాన్ను హెచ్చరిస్తున్నారు. రెండు రోజుల్లోగా ఆ వార్త వినేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె తీవ్ర స్వరంతో చెప్పారు.

Related Posts

Latest News Updates