కోర్టు డ్రామాలో ‘ఉద్వేగం’ కచ్చితంగా ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది – ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది – నవంబర్ 22న బ్రహ్మాండమైన విడుదల

కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో జి శంకర్, ఎల్ మధు నిర్మాతలుగా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం ఉద్వేగం. ఈ చిత్రానికి అజయ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా కార్తీక్ కొడగండ్ల సంగీతాన్ని అందించారు. త్రిగున్ ముఖ్యపాత్రలో నటించినున్న ఈ చిత్రంలో దీప్సిక కథానాయికగా నటించగా శ్రీకాంత్ భరత్, సురేష్ నాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, శివకృష్ణ, అంజలి తదితరులు కీలకపాత్రలు పోషించారు.

ఈ చిత్రం టీజర్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి చేతుల మీదగా విడుదల కావడం జరిగింది. చిత్రం టీజర్ చూస్తుంటే ఎంతో కష్టపడి తీశారని, అలాగే యాక్టర్ త్రిగున్ కు 25వ చిత్రం కావడం విశేషమని ఆర్జీవి అన్నారు. అంతేకాక కోర్టు రూములో వచ్చే చిత్రాలు చాల తక్కువ అని, ఈ చిత్రం మంచి సక్సెస్ కావాలని తన కోరుకుంటున్నట్లు ఆర్జీవి అన్నారు. కాగా ఇప్పటికే ఈ చిత్రం టీజర్ ఏంతో ప్రేక్షక ఆదరణ పొందింది.

2021లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత కోర్టు నేపథ్యంలో మరో సినిమా ఇదే కావడం విశేషం. ఈ నెల 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది అని చిత్ర బృందం వెల్లడించింది.

ఈ సందర్భంగా పరుచూరి గోపాల కృష్ణ గారు మాట్లాడుతూ : నేను విలన్ గా చేసిన పాత్రలు చూసి కొంతమంది మీరు మంచివారు విలన్ పాత్రలు ఎందుకు చేస్తున్నారని అడిగినందుకు అలాంటి పాత్రలు చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత ప్రజాస్వామ్యం అనే సినిమాలో ఒక మంచి పాత్ర చిన్న పాత్ర అయినా కూడా చేసి మెప్పించాను. అప్పటినుండి సినిమాల్లో చేస్తే మంచి పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నా. సినిమాలో నాయకుడికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రతి నాయకుడికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సినిమా దర్శకుడు మహిపాల్ రెడ్డి వెంటపడి నన్ను ఒప్పించి ఈ సినిమా చేయించుకున్నాడు. అదేవిధంగా హీరో ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంది. ప్రతి నాయకుడు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే నాయకుడు పాత్ర సినిమాలో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అలా ఈ సినిమాలో మా పాత్రలను రాసుకున్నారు. చిన్న సినిమాగా కాకుండా ఒక మంచి సినిమాగా ఈ సినిమాను ప్రేక్షకులు చూసి ఆదరించి విజయం చేకూర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

కౌశల్ మాట్లాడుతూ : సినిమా అంటేనే ఒక ఉద్వేగం. సినిమా కోసం అందరూ కష్టపడి పని చేస్తారు. అదేవిధంగా ఈ ఉద్వేగం టీం కూడా ఎంతో కష్టపడి ఈ సినిమా కోసం పని చేసి మంచి సినిమాని తీశారు. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కి మంచి డబ్బులు తెచ్చి పెట్టాలని, దర్శకుడు, హీరోకి మంచి పేరు తెచ్చి పెట్టాలని, సినిమాని ప్రేక్షకులు ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

సీనియర్ యాక్టర్ సురేష్ గారు మాట్లాడుతూ : ఈ రోజుల్లో మీడియా చాలా పవర్ ఫుల్ గా ఉంది. చిన్న సినిమాకు కాకుండా ఒక మంచి సినిమా ట్రై చేయండి అని మీడియా చెప్తే కచ్చితంగా చిన్న సినిమాలకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి మీడియా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాలి అని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేశారు. మా గురువుగారు పరుచూరి గోపాలకృష్ణ గారితో నటించడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా హీరో త్రిగున్ మరియు కౌశల్ కష్టపడి ఇండస్ట్రీలో పైకే దిగారు అలాంటి వాళ్ళకి మంచి సక్సెస్ అందాలని సినిమాతో మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేక్షకుల సినిమాని చూసి పెద్ద విజయం చేకూర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

ప్రొడ్యూసర్స్ శంకర్ మరియు మధు మాట్లాడుతూ : ఈ సినిమా కథ వినగానే నచ్చి సినిమాని స్టార్ట్ చేసాం. అడగగానే ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకున్న పరుచూరి గోపాలకృష్ణ గారికి సురేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. హీరో త్రిగున్ కి ఈ సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ ఇస్తుంది అని నమ్ముతున్నాను. చిన్న సినిమాగా కాకుండా ఒక మంచి సినిమాగా ఈ సినిమాని ప్రేక్షకుల ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

దర్శకుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ : నన్ను నమ్మి ఈ సినిమాని నాకు ఇచ్చిన మన నిర్మాతలకి అదే విధంగా ఈ సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్న పర్చూరు గోపాలకృష్ణ గారికి సురేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కోర్టు డ్రామా సినిమాగా ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకి ఎంగేజింగ్ గా ఉంటుంది. ఈ సినిమా చూసి నచ్చితే ఇంకో పది మందికి చెప్పి సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

హీరో త్రిగున్ మాట్లాడుతూ : ప్రతి సక్సెస్ఫుల్ హీరో వెనకాల ఒక రైటర్ ఉంటాడు. అలా ఎంతోమంది హీరోల వెనకాల పిల్లర్గా నిలబడి సపోర్ట్ చేసిన పరుచూరి గోపాలకృష్ణ గారు ముందు ఈ రోజు నేను నిలబడ్డం ఆయనతో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి మనిషికి ఓ పదేళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది నేను చేశాను అని చెప్పుకునే గొప్ప సినిమా ఒకటి ఉంటుంది నాకు అలాంటి సినిమానే ఉద్వేగం. ఈ సినిమా కథకి నేను సరిపోతాను అని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన మా దర్శకుడు ప్రొడ్యూసర్స్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. మీడియా కూడా ఈ సినిమాని సపోర్ట్ చేయాలని అలాగే ప్రేక్షకుల సినిమా చూసి పెద్ద సక్సెస్ చేకూర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు: త్రిగున్, దీప్సిక, శ్రీకాంత్ భరత్, సురేష్ నాయుడు, పరుచూరి గోపాలకృష్ణ, శివ కృష్ణ, అంజలి తదితరులు

టెక్నీషియన్స్ :
సంగీతం: కార్తిక్ కొడగండ్ల
సినిమాటోగ్రఫీ: అజయ్
ఎడిటర్: జశ్వీన్ ప్రభు
నిర్మాతలు: జి శంకర్, ఎల్ మధు
దర్శకుడు: మహిపాల్ రెడ్డి
పీఆర్ఓ: హరీష్, దినేష్

Related Posts

Latest News Updates