పీఎఫ్ఐ అష్టదిగ్బంధనం… సోషల్ మీడియా అకౌంట్లను తొలగించిన కేంద్రం

పీఎఫ్ఐపై కేంద్ర నిషేధం విధించిన మరుసటి రోజు ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పీఎఫ్ఐకి చెందిన ట్విట్టర్ అకౌంట్ ను నిలిపేస్తూ ట్విట్టర్ నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ తో పాటు ఇన్ స్టా, ఫేస్ బుక్ ను కూడా తొలగించారు. పీఎఫ్ఐ చైర్మన్ ఒమా సలామ్ ట్విట్టర్ ను కేంద్రం నిలిపేసింది. ఇప్పుడు పీఎఫ్ఐకి చెందిన ఏ సోషల్ మీడియా అకౌంట్ కూడా అందుబాటులో లేదు. మరోవైపు పీఎఫ్ఐకి చెందిన పలువురు నేతల ఖాతాలను కూడా ట్విట్టర్ తొలగించింది. చైర్మన్ సలామ్, ప్రధాన కార్యదర్శి అనిస్ అహ్మద్ కు చెందిన ఖాతాలను కూడా ట్విట్టర్ నిలిపేసింది.

 

 

పాపులర్ ఫ్రంట్ ఆఫ్​ ఇండియా (పీఎఫ్ఐ), దానికి అనుబంధంగా ఉన్న 8 సంస్థలపై కేంద్రం నిషేధం విధించింది. టెర్రరిస్ట్ సంస్థలతో లింకులు ఉన్నాయని, దేశంలో ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసం, ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టేందుకు కుట్రలు చేసినట్లు ఆధారాలు దొరకడంతో వీటిని నిషేధించినట్లు బుధవారం కేంద్ర హోం శాఖ ప్రకటించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద వీటిని ఐదేండ్ల పాటు బ్యాన్ చేస్తున్నామని కేంద్రం తన నోటిఫికేషన్ లో పేర్కొంది.

Related Posts

Latest News Updates