ఒకే సారి 3 సినిమాలతో T V మెగాస్టార్‌ ప్రభాకర్‌ తనయుడు ‘చంద్రహాస్‌’ హీరో గా టాలీవుడ్ ఎంట్రీ

బుల్లితెర మెగాస్టార్‌ ప్రభాకర్‌ (ఈటీవీ ప్రభాకర్‌) తనయుడు, త్వరలో ప్రేక్షకుల ముందుకు హీరోగా రాబోతున్న చంద్రహాస్‌ పుట్టిరోజు (17వ తేదీ)ను పురస్కరించుకుని శుక్రవారం  ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో మీడియాలో ‘ఇంట్రడ్యూసింగ్‌ చంద్రహాస్‌’ పేరుతో మీడియాతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అతను నటిస్తున్న చిత్రాల నుంచి హ్యాపీబర్త్‌డే విషెస్‌తో కూడిన పోస్టర్‌లను చంద్రహాస్‌ తల్లి, ప్రభాకర్‌ గారి భార్య మలయజ లాంచ్‌ చేశారు. అలాగే ఇదే వేదికపై మీడియా మిత్రుల సమక్షంలో చంద్రహాస్‌ కేక్‌ కట్‌ చేశారు.
ఈ సందర్భంగా ఈటీవీ ప్రభాకర్‌ మాట్లాడుతూ… నేను ఇండ్రస్టీకి వచ్చి 25 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ మీడియాతో ఇంటరాక్ట్‌ అవడం చాలా తక్కువ. ఇప్పుడు ఈ ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేయడానికి కారణం శనివారం (17న) మా అబ్బాయి చంద్రహాస్‌ పుట్టినరోజు. తను కూడా ఇండస్ట్రీని నమ్ముకుని నటననే ప్రొఫెషన్‌గా తీసుకుని ముందుకు వెళుతున్నాడు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. తండ్రిగా వాడికి ఇష్టమైన దాన్ని ప్రోత్సహించడం నా ధర్మం కనుక చేస్తున్నాను. హీరో కావాలనేది కేవలం చంద్రహాస్‌ కోరిక మాత్రమే. ఈ విషయంలో నా ఇన్‌వాల్వ్‌మెంట్‌ అస్సలు లేదు. చాలా కాలం నుంచి యాక్టర్‌ అవుతా అని నా వెంట పడుతున్నాడు. కానీ నేనే ఇప్పుడే వద్దు, ముందు చదువు పూర్తి చెయ్యి. ఆ తర్వాతే ఏదైనా అన్నాను. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఓ వైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు సినిమా హీరోకు కావాల్సిన ఫైట్స్‌, డాన్స్‌లు, యాక్టింగ్‌ వంటి అంశాల్లో శిక్షణ తీసుకుంటూ తనను తాను తీర్చి దిద్దుకున్నాడు. ఓ రోజు నా దగ్గరకు వచ్చి నాకు కొంత డబ్బు ఇవ్వు డాడీ దాంతో నేను యూట్యూబ్‌లో కవర్‌ సాంగ్స్‌ చేసుకుంటాను. అలా నన్ను నేను పరిశ్రమకు పరిచయం చేసుకుంటాను అన్నాడు. అలా చేసిన ‘‘నాటు నాటు’’ అనే కవర్‌ సాంగ్‌ వీడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. పేరుతో పాటు సినిమా హీరోగా కూడా రెండు అవకాశాలు వచ్చాయి. ఈ విషయంలో నేను ఆశ్చర్యపోయాను. గతంలో రెండు సినిమాలు నిర్మించిన  ప్రొడ్యూసర్స్‌ కిరణ్‌ బోయినపల్లి, కిరణ్‌ జక్కంశెట్టిలు ఐ.ఇ.ఎఫ్‌, ఆర్‌.కె-ఏ.కె ఫిలింస్‌ పతాకం ‘ప్రొడక్షన్‌ నెం.3’గా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచన దర్శకత్వం కృష్ణ. అలాగే ఏవీఆర్‌ మూవీ వండర్స్‌ పతాకంపై గతంలో రెండు సినిమాలను నిర్మించిన ఏవీఆర్‌, నరేష్‌ గార్లు తమ మూడో చిత్రంగా ‘ప్రొడక్షన్‌ నెం.3’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి దర్శకుడు సంపత్‌ వి. రుద్ర. వీరితో పాటు మా స్వంత సంస్థ శ్రీ సుమనోహర ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై ఓ చిత్రాన్ని నిర్మించటానికి ప్లాన్‌ చేశాం. దీనికి నా మిత్రులు కళ్యాణ్‌, వెంకట్‌, కాముని శివ, ప్రేమ్‌ సాగర్‌, తోట సురేష్‌లు కో`ప్రొడ్యూసర్‌లు. అయితే మా సినిమా కొంత టైం తీసుకుని ప్రారంభిస్తాం. దీనికి కథ, స్క్రీన్‌ప్లేను నేను అందిస్తున్నాను. మిగిలిన టెక్నీషియన్స్‌ కూడా ఫైనల్‌ అయ్యారు. ముందు రెండు చిత్రాలు ఆల్రెడీ షూటింగ్‌లు జరుపు కుంటున్నాయి. శనివారం (17వ తేదీ) మా అబ్బాయి పుట్టిన రోజు. ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్‌ అయితే బాగుంటుంది అని అనిపించింది. అందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. చంద్రహాస్‌ను నటనవైపు ఎక్కువగా ప్రోత్సహించింది వాళ్ల అమ్మ, నా భార్య మలయజ. చంద్రహాస్‌ తాను చేసిన యూట్యూబ్‌ వీడియో ద్వారా నా ప్రమేయం లేకుండానే హీరోగా అవకాశాలు తెచ్చుకోవడం తండ్రిగా గర్వంగా ఉంది. తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకోగలడనే నమ్మకం ఉంది అన్నారు. చంద్రహాస్‌ తల్లి, ప్రభాకర్‌గారి భార్య మలయజ గారు మాట్లాడుతూ… చంద్రహాస్‌ కూడా వాళ్ల నాన్నగారిలానే మంచి హార్డ్‌ వర్కర్‌. ఏదైనా అనుకుంటే చేసి తీరాల్సిందే అన్నట్టుగా ఉంటాడు. అలా పట్టుబట్టి ఈరోజు హీరోగా మారుతున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులకు ఇంతకు మించి ఆనందం ఏముంటుంది.  మా చంద్రహాస్‌ నిర్మాతలకు ఎప్పుడూ ఎస్సెట్‌ కావాలి అని కోరుకుంటున్నాను. మా అబ్బాయిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అన్నారు.
మీడియాతో చిట్‌ చాట్‌లో హీరో చంద్రహాస్‌ మాట్లాడుతూ…  ‘‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నగారితో పాటు అనేక మంది నటీనటులు, టెక్నీషియన్స్‌ల మధ్య సినిమాలు, టీవీ సీరియల్స్‌, టెలీ ఫిలిమ్స్‌ ఇలా షూటింగ్‌ల వాతావరణంలోనే పెరిగాను. అందుకే నాకు సినిమా తప్ప ఇంకేమీ తెలియదు. పుట్టి నప్పటి నుంచీ పరిశ్రమలోనే ఉన్నాను.. ఇక మీదట కూడా ఇక్కడే ఉంటాను. హీరో అవ్వాలనేది నా డ్రీమ్‌. దీని కోసం నాన్నగారిని ఎంతగా విసిగించినా పని అవ్వలేదు. ఆయన నీకు ఇంకా అంత వయస్సు రాలేదు. కనీసం 25 సంవత్సరాలు అన్నా రావాలి. అప్పుడే నీ ఫిజిక్‌లో హీరోకి కావాల్సిన మెచ్యూరిటీ వస్తుంది అని అడ్డుపడేవారు. నాకేమో ఎప్పుడెప్పుడు హీరో అయిపోదామా అని రోజూ అనిపిస్తూ ఉండేది. ఇక ఆగలేక నాన్నను కొంత అమౌంట్‌ అడిగి ‘‘నాటు నాటు’’ కవర్‌ సాంగ్‌ చేశాను. ఇది చూసి నాకు అవకాశం ఇచ్చారు మా దర్శక, నిర్మాతలు. నటనతో పాటు పరిశ్రమలోకి అడుగుపెట్టేటప్పుడు మన బిహేవియర్‌ కూడా చాలా ముఖ్యం. నాన్నగారి కెరీర్‌లో అప్స్‌ అండ్‌ డౌన్స్‌ నేను కళ్లారా చూశాను. అయినప్పటికీ ఆయన బిహేవియర్‌తోనే ఇప్పటికీ వ్యక్తిగా అందరూ ఇష్టపడే స్థాయిని కొనసాగిస్తున్నారు. నేను కూడా ఇలాగే అందరినీ గౌరవిస్తూ ముందుకు సాగాలని మా అమ్మగారి కోరిక. ఆమె నాకు చెప్పిన ముఖ్యమైన విషయం కూడా ఇదే. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించడానికి నా వైపు నుంచి ఎటువంటి లోపం లేకుండా కృషి చేస్తాను. హిట్‌, ఫ్లాపులతో సంబంధం లేకుండా పరిశ్రమలోనే కొనసాగాలని డిసైడ్‌ అయ్యాను. పరిశ్రమలోనే చాలా మందిని చూసి  ఇన్‌స్పైర్‌ అయ్యాను. ముఖ్యంగా రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌లను చూసి. వారి డెడికేషన్‌ హాల్‌సమ్‌. ఈ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం.. రాబోయే రోజుల్లో నా సినిమాల విడుదలకు ముందు ప్రమోషన్‌లో ఇంట్రడ్యూస్‌ అవ్వడం కంటే.. చంద్రహాస్‌ అనే నటుడు ఒకడున్నాడు.. అతను నటిస్తున్న సినిమా ఇది అని అటు ప్రేక్షకులకు, ఇటు పరిశ్రమకు నన్ను నేను ముందస్తుగా పరిచయం చేసుకోవడం. మీడియా సహకారం లేనిదే ఏ ఆర్టిస్ట్‌కి, టెక్నీషియన్‌కి గుర్తింపు ఉండదు. అందుకే మీ అందరి ఆశీర్వాదాలు తీసుకోవాలని ముందుగా మిమ్మల్ని కలిసేందుకు ఈ చిన్న ప్రయత్నం అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చంద్రహాస్‌ చిత్రాల నిర్మాతలు, దర్శకలు, ఇతర టెక్నీషియన్స్‌ను వేదిక మీదకు పిలిచి మీడియాకు పరిచయం చేశారు ప్రభాకర్‌. చివరిగా బంధుమిత్రులు, మీడియా, అతిథుల సమక్షంలో పుట్టినరోజు కేక్‌ కట్‌ చేశారు చంద్రహాస్‌.

Related Posts

Latest News Updates