హిందీ చలన చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. యువనటి తునిషా శర్మ (20) ఆత్మహత్యకు పాల్పడింది. ఓ సీరియల్ సెట్స్ లో ఆత్మహత్యకు ప్రయత్నించగా… ఆమెను ఆస్పత్రికి తరలించగా… అప్పటకే మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు. అయితే… నటి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది. తునిషా భారత్ కా వీర పుత్ర మహారాణ ప్రతాప్ అనే సీరియల్ తో చిన్న వయస్సులోనే కెరీర్ ప్రారంభించింది. చక్రవర్తి అశోక సమ్రాట్, గబ్బర్ పూంచవాలా, షేర్ పంజాబీ, మహారాజ రంజిత్ సింగ్, ఇంటర్నెట్ వాలా లవ్, ఇష్క్ సుభానా అల్లా, అలీబాబా వంటి ధారవాహికల్లోనూ ముఖ్య పాత్రలు పోషించింది. అయితే..వచ్చే జనవరి 4 న తునిషా పుట్టిన రోజు జరుపుకోబోతోంది. అంతలోనే ఈ విషాం జరిగింది.