టర్కీ, సిరియాలను భూకంపం కుదిపేసింది. దాదాపు 4500మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నంలోపు మూడుసార్లు భూకంపం రావడంతో భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. ఇప్పటికీ చాలా మంది భవనాల శిథిలాల కింద ఇరుక్కొని పోయారని పలువురు పేర్కొంటున్నారు. దీంతో వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక్క సిరియాలోనే భూకంపంతో 2000 మంది చనిపోయినట్లు అక్కడి మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. సుమారు 20 వేల మంది తీవ్రంగా గాయపడి వుంటారని ఓ అంచనాకి వచ్చారు. టర్కీలోనే దాదాపు 15 వేలు, సిరియాలో దాదాపు 5 వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 20 వేల మందికి పైగా మరణించి వుంటారని WHO ఓ అంచనాకి వచ్చేసింది. 7.8, 7.6, 6.0 రిక్టర్ స్కేలుపై నమోదైంది.

దీంతో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. కరెంట్ లేకుండా పోయింది. నీటి సరఫరాకి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూకంపం తీవ్రతతో టర్కీ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దీంతో సహాయం చేసేందుకు భారత్ తో సహ 12 దేశాలు తక్షణ సహాయం చేసేందుకు ముందుకు కదిలాయి. రిలీఫ్ మెటీరియల్ ను టర్కీకి పంపించాయి కూడా. తుర్కియేలో వచ్చిన భూకంపం వల్ల గ్రీన్‌ల్యాండ్‌లో కూడా ప్రకంపనలు నమోదు అయినట్లు డెన్మార్క్ జియోలాజికల్ సర్వే పేర్కొన్నది. 1999లో వచ్చిన 7.4 తీవ్రత భూకంపం తర్వాత ఇదే పెద్ద కంపమని ఇస్తాంబుల్ అధికారులు వెల్లడించారు. ఆ ఏడాది వచ్చిన భూకంపంలో 17వేల మంది మరణించారు. ప్రస్తుతం దక్షిణ తుర్కియేలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అమెరికా, భారత్‌తో పాటు చాలా వరకు దేశాలు సహాయాన్ని అందిస్తున్నాయి.

తుర్కియేలో వచ్చిన భూకంపం వల్ల గ్రీన్‌ల్యాండ్‌లో కూడా ప్రకంపనలు నమోదు అయినట్లు డెన్మార్క్ జియోలాజికల్ సర్వే పేర్కొన్నది. 1999లో వచ్చిన 7.4 తీవ్రత భూకంపం తర్వాత ఇదే పెద్ద కంపమని ఇస్తాంబుల్ అధికారులు వెల్లడించారు. ఆ ఏడాది వచ్చిన భూకంపంలో 17వేల మంది మరణించారు. ప్రస్తుతం దక్షిణ తుర్కియేలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అమెరికా, భారత్‌తో పాటు చాలా వరకు దేశాలు సహాయాన్ని అందిస్తున్నాయి.












