మరో రికార్డు నెలకొల్పిన తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం మరో రికార్డు నెలకొల్పింది. దేశంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించిన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శ్రీవారి ఆలయం రెండో స్థానంలో నిలిచింది. ఈ రిపోర్టును ఓయో కల్చరల్ ట్రావెల్ ప్రకటించింది. తిరుమల రెండో స్థానంలో నిలవగా… మొదటి స్థానంలో వారణాసి దేవస్థానం నిలిచింది. ఓయో కల్చరల్ ట్రావెల్ సంస్థ దేశ వ్యాప్తంగా భక్తులు చూసిన దర్శనీయ, పర్యాటక ప్రాంతాలపై సర్వే నిర్వహించింది. అయితే.. గతంలో కరోనా ఆంక్షల కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. దేవస్థానం ఎప్పుడైతే కరోనా ఆంక్షలను ఎత్తేసిందో… మళ్లీ ఎప్పటిలాగే భక్తుల రద్దీ పెరిగింది. గత యేడాదితో పోలిస్తే ఈ సారి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య 23 శాతం పెరిగింది.

Related Posts

Latest News Updates