తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఫిక్స్ డ్ డిపాజిట్లను బహిర్గత పరిచింది. ఫిక్స్ డ్ డిపాజిట్ల విషయంలో వస్తున్న వదంతులను నమ్మవద్దని టీటీడీ స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీవారి ఆస్తులకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేసింది. శ్రీవారికి మొత్తం బ్యాంకుల్లో 15,938 కోట్ల డిపాజిట్లు వున్నాయని టీటీడీ తన శ్వేత పత్రంలో పేర్కొంది. ఇక… 10,258.37 కేజీల బంగారం, 24 జాతీయ బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసినట్లు పేర్కొంది. గత 3 సంవత్సరాలలో స్వామి వారి నగదు, డిపాజిట్లు భారీగానే పెరిగాయని టీటీడీ తెలిపింది.