తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు భారీగానే ఝలక్ ఇచ్చింది. వసతి గదుల అద్దెను భారీగా పెంచేసింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో వుండే నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల ధరలను పెంచేశారు. 500, 600 రూపాయల నుంచి ఏకంగా 1000 రూపాయలకు పెంచేశారు. నారాయణగిరి గెస్ట్ హౌజ్ లోని 1,2,3 గదులను 150 నుంచి జీఎస్టీతో కలిపి 1,700 కి పెంచేశారు. రెస్ట్ హౌజ్ 4 లో ఒక్కో గదికి ప్రస్తుతం 750 వసూలు చేస్తుండగా… ఇప్పుడు దానిని 1,700 రూపాయలకు పెంచేశారు. కార్నర్ సూట్ ను జీఎస్టీతో కలిపి 2,200 కు చేశారు. స్పెషల్ టైప్ కాటేజెస్ లో 750 వున్న గది అద్దెను జీఎస్టీతో కలిపి 2800 చేశారు. ఈ అడ్డదిడ్డపు బాదుడుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
