హైదరాబాద్ లోని చారిత్రక ప్రదేశాలను చూసేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసును కల్పించింది. ఈ బస్సుకు హైదరాబాద్ దర్శిని గా నామకరణం చేశారు. ఈ బస్సు ప్రతి శని, ఆదివారాల్లో రెండు సర్వీసులను నడపనున్నారు. ఉదయం 8:30 గంటలకి సికింద్రాబాద్ లోని ఆల్ఫా హోటల్ నుంచి ఈ టూరిస్ట్ బస్సు బయల్దేరుతుంది. నగరంలోని పలు చారిత్రక ప్రదేశాలు తిరుగుతూ… రాత్రి 8 గంటలకి అదే అల్ఫా హోటల్ దగ్గరికి వచ్చేస్తుందని అధికారులు తెలిపారు. ఇక ఛార్జీల విషయానికొస్తే మెట్రో ఎక్స్ ప్రెస్ లో పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.130, మెట్రో లగ్జరీ ఏసీ బస్సులో పెద్దలకు రూ.450, పిల్లలకు రూ. 340 ఛార్జీగా నిర్ణయించారు.