తెలంగాణ ప్రభుత్వానికి, సీఎస్ కి తెలంగాణ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. వెంటనే ఏపీకి వెళ్లిపోవాలని సీఎస్ సోమేశ్ ను హైకోర్టు ఆదేశించింది. సీజే జస్టిస్ ఉజ్జల భూయాన్ బెంచ్ ఈ తీర్పును వెల్లడించింది. అయితే.. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్ ను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది.
అయితే… కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను ఆపేసి… సోమేశ్ కుమార్ తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్ ఉత్తర్వుల జారీ చేసింది. దీంతో సీఎస్ గా సోమేశ్ కుమార్ కొనసాగుతున్నారు. అయితే.. 2017 లో క్యాట్ ఉత్తర్వులను కొట్టేయాలంటూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఇవాళ క్యాట్ ఉత్తర్వులను కొట్టేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పునిచ్చింది. అయితే సోమేశ్ లాయర్ అభ్యర్థనతో హైకోర్ట్ తీర్పు 3 వారాల పాటు నిలిపివేసింది.