న్యూ ఇయర్​ సందర్భంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోని పబ్ లకు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాత్రి 10 తర్వాత మ్యూజిక్ పెట్టరాదని హైకోర్టు ఆదేశించింది. 10 పబ్బుల్లో న్యూ ఇయర్ ఈవెంట్స్ లోనూ 10 తరువాత సౌండ్ పెట్టరాదని పేర్కొంది. గతంలో ఇచ్చిన ఆదేశాలపై పబ్ నిర్వాహకులు హైకోర్టులో వెకెట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు మరోసారి విచారించిన న్యాయస్థానం.. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకే న్యూఇయర్ వేడుకలు అంటూ ఆదేశించింది. జూబ్లీహిల్స్‌లో ఉన్న 10 పబ్‌ల్లో రాత్రి 10 గంటల తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ సౌండ్స్‌కు అనుమతించేది లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇక… న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. పలు రోడ్లలో వాహనాలను అనుమతించమని ప్రకటించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా నిర్వహిస్తామని ప్రకటించారు.