తెలంగాణ పోలీసు ఉద్యోగార్థులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. కటాఫ్ మార్కుల విషయంలో సీఎం కేసీఆర్ చెప్పిన మాటకు కట్టుబడి, తెలంగాణ పోలీస్‌ నియామక మండలి కటాఫ్‌ మార్కులపై జీవోను సవరిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఓసీ అభ్యర్థులకు 30శాతం, బీసీ అభ్యర్థులకు 25శాతం, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు 20శాతం మార్కులను కేటాయిస్తున్నట్టు తన అధికారిక వెబ్‌సైట్‌లో నోటీసు ద్వారా వెల్లడించింది.

 

దీనిప్రకారం.. 200 మార్కులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో ఓసీ అభ్యర్థులకు 60 మార్కులు, బీసీ అభ్యర్థులకు 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు 40 మార్కులు వస్తే ఉత్తీర్ణులవుతారు. శారీరధారుడ్య పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్‌ మార్కులు 30 శాతంగా, బీసీలకు 35 శాతంగా, ఓసీలకు 40 శాతంగా ఉండేవి. కానీ, ఈసారి సామాజికవర్గాలతో సంబంధం లేకుం డా అందరికీ 30 శాతం మార్కులను అర్హతగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది.