2024 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రెట్స్ తనను మోసం చేసి గెలిచారని ఆరోపించారు. దేశాన్ని సురక్షితంగా వుంచడానికి, విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి చాలా చేశా. బహుశ: మళ్లీ చేస్తాను… చాలా చాలా చేస్తాను. రెడీగా వుండండి. నిజంగానే చెబుతున్నాను అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయోవాలో జరిగిన ర్యాలీలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. 2020 ఎన్నికల సమయంలో జరిగిన మోసం వల్ల తాను పరాజయం పొందానని, ఈసారి కచ్చితంగా తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే తాను రెండుసార్లు పోటీ చేశానని చెప్పిన ఆయన.. 2020లో కంటే 2022లో ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
