తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిశారు. మనీలాండరింగ్ కేసులో రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే పైలట్ రోహిత్ రెడ్డి సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. అంతకు ముందు ఈ ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్న పైలట్ రోహిత్‌రెడ్డి పూజలు చేసి అమ్మవారి సాక్షిగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. బండి సంజయ్ తడి బట్టలతో రేపు భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి రావాలన్నారు. ‘‘తనకు డ్రగ్స్ కేసులో నోటీసులు వచ్చినట్లు చూపించాలని సవాల్ విసిరారు. బండి సంజయ్‌కి తంబాకు వల్ల నోరు తిరగడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. తమకు ఈడీ నోటీసులు వస్తాయని బీజేపికి ముందే ఎలా తెలుసని ప్రశ్నించారు. బీజేపీకి అబద్దాలు చెప్పడం కామన్‌గా మారిందని దెప్పిపొడిచారు.