ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ నేతలు కలుసుకున్నారు. టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి ఈసీని కలుసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మారుస్తూ చేసిన తీర్మానం ప్రతులను వారు అధికారులకు అందజేశారు. కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ ధర్మేంద్ర శర్మకు అందజేశామని బోయినపల్లి వినోద్ కుమార్ ప్రకటించారు. త్వరలోనే తమ దరఖాస్తును పరిశీలించి, నిర్ణయం తీసుకుంటుందని తమతో అన్నారని వినోద్ వెల్లడించారు. శంలో ఏ రాజకీయ పార్టీ అయినా తమ పార్టీ పేరు, చిరునామా మార్చుకున్నప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుందన్నారు.
బీఆర్ఎస్ అబ్రివేషన్ పేరుతో ఏ రాజకీయ పార్టీ అయినా ఉండొచ్చు కానీ, పార్టీ పూర్తి పేరు ముఖ్యం అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక వరకు పార్టీ పేరు మారితే బీఆర్ఎస్ మీదనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. బుధవారం (ఈనెల 5న) టీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశం తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా (టీఆర్‌ఎస్) మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ నేతృత్వంలో బృందం నేడు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమయింది.