మునుగోడులో అధికార టీఆర్ఎస్ ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే మంత్రులు ఆయా మండలాల్లో స్పీడ్ గా పర్యటిస్తూ… తమకు ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఇక… అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. మునుగోడు అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని, ఇంటింటికీ వెళ్లి తనను గెలిపించాలని కోరుతున్నారు. రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి నిరోధకుడని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. 2018 ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యే ఉన్నానని, ప్రజా సమస్యలను పరిష్కరించానని చెప్పారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యులన్నారు. మరోసారి గెలిపిస్తే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తానని హామీఇచ్చారు.