‘సైంధవ్’ డైరెక్టర్ శైలేష్ కొలను చేతుల మీదుగా ‘రామ్‌’ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) ట్రైలర్.. ఆకట్టుకుంటోన్న విజువల్స్, డైలాగ్స్

దేశభక్తిని చాటి చెప్పే చిత్రంగా రామ్‌ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) రాబోతోంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా ఈ సినిమాను రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల హీరోగా పరిచయం కానున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటించారు.

ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా రాహుల్ సిప్లిగంజ్ పాడిన దేశ భక్తి గీతం, మనతోని కాదురా భై అంటూ సాగే రొమాంటిక్ పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. శైలేష్ కొలను విడుదల చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

‘జీవితం అనేది ఒక యుద్దం.. చుట్టూ మనుషులు ఉన్నా లేకపోయినా.. నీ పోరాటం నువ్వే చేయాలి.. ఆ పోరాటంలో నా రామ్ గెలుస్తాడని నాకు నమ్మకం ఉంది.. గెలుస్తావ్ కదా?’ అంటూ తండ్రి చెప్పే మాటలతో ట్రైలర్ అద్భుతంగా ఓపెన్ అయింది. ‘ఈ 60 ఏళ్ల స్వాతంత్ర్యం ప్రజలది కాదు.. అధికారులది కాదు.. రాజకీయ నాయుకులది మాత్రమే.. మీరు అప్పుడూ బానిసలే.. ఇప్పుడూ బానిసలే.. ఎప్పుడూ బానిసలే’ అంటూ శుభలేఖ సుధాకర్ గారు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇలా సినిమాలో దేశ భక్తిని చాటే ఎన్నో డైలాగ్స్ ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. కళ్ళలో త్రివర్ణ పతాకాన్ని చూపించే షాట్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ ట్రైలర్‌ని చూస్తున్నంతసేపు సినిమా చూడాలని ఆసక్తిని రేకెత్తించేలా ఉంది.

కమర్షియల్, యాక్షన్, పేట్రియాటిక్ జానర్లో రాబోతోన్న ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తుండగా.. ధారన్ సుక్రి సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు.

ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే విడుదలకు సిద్దంగా ఉంది. ఈ మేరకు చిత్రయూనిట్ రిలీజ్ కోసం సన్నాహాలు చేస్తోంది.

సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మిహిరామ్ వైనతేయ
నిర్మాత: దీపికాంజలి వడ్లమాని
బ్యానర్స్: దీపికా ఎంటర్‌టైన్‌మెంట్ & ఓ ఎస్‌ యం విజన్‌
సంగీతం: ఆశ్రిత్ అయ్యంగార్
సినిమాటోగ్రఫీ దర్శకుడు: ధారన్ సుక్రి
పీఆర్వో: సాయి సతీష్

Related Posts

Latest News Updates