అమెరికాలోని కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పుల ఘటన కలకలం రేపింది. నిన్న చికాగోలో జరిగిన కాల్పుల్లో ఓ తెలుగు విద్యార్థి మరణించాడు. రెండు, మూడు రోజుల క్రిందటే కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే నగరంలో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి, ఏడుగురిని కాల్చి చంపాడు. అది మరిచిపోక ముందే మళ్లీ చికాగోలో కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. విజయవాడకు చెందిన దేవాన్ష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గాయాల కారణంగా మరణించారు. హైదరాబాదీ విద్యార్థి సాయిచరణ్ పరిస్థితి కాస్త నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికాలోని చికాగోలో దోపిడీకి యత్నించిన కొందరు దుండగులు.. కాల్పులు జరపడంతో ఒకరు మరణించగా.. మరో విద్యార్ధి గాయపడ్డారు. ఈ దుండగుల కాల్పుల్లో విజయవాడకు చెందిన దేవాన్ష్ అనే విద్యార్థి మరణించాడు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని బీహెచ్ఈఎల్కు చెందిన కొప్పల సాయిచరణ్ అనే విద్యార్థి గాయపడ్డాడు. విశాఖపట్నానికి చెందిన మరో విద్యార్థి లక్ష్మణ్ సురక్షితంగా బయటపడ్డాడు. గాయపడ్డ వారిలో ఒకరిని చికాగో యూనివర్సిటీ మెడికల్ సెంటర్కు తరలించారు.
సాయిచరణ్ జనవరి 11న చికాగోలోని గవర్నర్ స్టేట్ యూనివర్శిటీలో ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్లాడు. అక్కడే మిగిలిన ఇద్దరు కూడా చదువుతున్నారు. ఆదివారం జరిగిన కాల్పుల్లో సాయిచరణ్ గాయపడి.. ఆస్పత్రిలో చేరినట్లు అతని స్నేహితులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సాయిచరణ్ తల్లిదండ్రులు కెవిఎం లక్ష్మి, శ్రీనివాసరావు తమ కుమారుడిపై కాల్పులు జరిపారనే వార్తతో షాక్కు గురయ్యారు. బంధువులు, స్నేహితులు దంపతుల ఇంటికి చేరుకుని వారిని ఓదార్చారు. అయితే… రెండు రోజుల క్రిందట కాల్పులు జరిపిన వ్యక్తులను తాము అదుపులోకి తీసుకున్నామని అక్కడి పోలీసులు పేర్కొంటున్నారు. ఇలా వరుసగా అమెరికాలో కాల్పులు జరుపుతుండటంతో తీవ్ర భయభ్రాంతులు నెలకొంటున్నాయి. బైడెన్ ప్రభుత్వం దీనిపై శ్రద్ధ వహించడం లేదని విమర్శలు వస్తున్నాయి.