మేడ్చల్ జిల్లాలో విషాదం జరిగింది. జవహర్ నగర్ పరిధిలోని మల్కారం చెరువులో ఈతకు వెళ్లిన ఆరుగురు చనిపోయారు. ఇందులో ఐదుగురు చిన్నారులు కాగా, ఒకరు పెద్ద వయస్సు వున్న వారు. వీరంతా ఓ ఫంక్షన్ కోసం మల్కారం గ్రామానికి వచ్చారని అంటున్నారు. అయితే… తనతో పాటు వచ్చిన చిన్నారులు ఈత కోసం చెరువులోకి దిగి, ఎంతకూ బయటకు రాలేక, మునిగిపోతుంటే…. ఆ వ్యక్తి వెంటనే అప్రమత్తమయ్యాడు. ఈ క్రమంలో వారిని కాపాడే ప్రయత్నంలో ఆ వ్యక్తి కూడా చనిపోయాడు. అయితే.. లోతును అంచనా వేయడంలో వారు విఫలమయ్యారని, అందుకే చనిపోయారని అంటున్నారు.