నిజాం వారసుడు, 8వ నిజాం ముకురం ఝాకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించుకోవడాన్ని ఆయన స్వాగతించారు. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టే వారు మానసిక వైకల్యం కలవారని మండిపడ్డారు.

అందరూ గర్వించే ఓ గొప్ప పనికి ముకురం ఝా పేరు పెట్టాలని రేవంత్ ప్రతిపాదించారు. ఏ కార్యక్రమానికి ఆయన పేరు పెడితే బాగుంటుందో అసెంబ్లీలో అందరితో చర్చించి నిర్ణయించాలన్నారు. నిజాం నవాబుల పాలనలో కొన్ని తప్పులు జరిగినా.. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని రేవంత్ తెలిపారు. ఆ తప్పులను కాంగ్రెస్ సమర్థించదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.