తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. సర్పంచుల సమస్యలపై ధర్నా చౌక్ లో నిరసన నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో రేవంత్ రెడ్డి పాల్గొనడానికి సిద్ధపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు తరలిరావాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.దీనిపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. ఇదేం ప్రజాస్వామ్యం? అంటూ మండిపడ్బడారు. సీఎం ప్రగతి భవన్ నుంచి బయటికి రారని, సామాన్య ప్రజలకు వారిని కలిసే యాక్సిస్ లేదని విమర్శించారు. ఒక వేళ సీఎంని విమర్శిస్తే… హౌజ్ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.

మరోవైపు కాంగ్రెస్ చేపట్టిన ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అనుమతి నిరాకరించినా… తాము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. మరో వైపు కాంగ్రెస్ ముఖ్య నేతలను కూడా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వీహెచ్, కోదండ రెడ్డితో పాటు.. పలువుర్ని అరెస్ట్ చేశారు.