తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో పార్టీ నేతలు తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. తాము ఇచ్చిన ఆధారాలను సీబీఐకి బదిలీ చేయాలని రేవంత్ డీజీపీని కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఆ నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మిగతా వారిపై కూడా సీబీఐ విచారణ చేపట్టాలని తాము కోరామన్నారు. ఇక… కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడుల విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి డీజీపీ ముందు వుంచారు. ఇక… తాము సీఎస్ సోమేశ్ కుమార్ అపాయింట్ మెంట్ కూడా అడిగామని, జ్వరం వచ్చిందంటూ తప్పించుకు తిరుగుతున్నారని రేవంత్ విమర్శించారు.







