తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతల బృందం సీఎస్ సోమేశ్ కుమార్ తో భేటీ అయ్యింది. రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కరించాలంటూ మెమోరాండం అందజేసింది. ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని, పాత పద్ధతినే తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాలో పొరపాటుగా నమోదైన భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కాంగ్రెస్ కోరింది. సీఎస్ ను కలిసిన వారిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, సీతక్క, జగ్గారెడ్డి, సీనియర్ నేతలు చిన్నారెడ్డి, కోదండరెడ్డి, అంజన్ కుమార్, నాగం జనార్దన్ రెడ్డి తదితరులు వున్నారు.