టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కు కెరీర్ స్టార్టింగ్ లో ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ సినిమాలతో మంచి విజయాలు అందాయి. కానీ తర్వాత మాత్రం ఫ్లాపులు వెంటాడుతున్నాయి. వెంటవెంటనే సినిమాలు చేసేయాలనే ఉద్దేశంతో క్వాలిటీ చూసుకోకపోవడం వల్లే రాజ్ తరుణ్ కెరీర్ ఇలా అయిపోయింది. రాజ్ తరుణ్ సోలోగా హిట్ అందుకుని చాలా రోజులైంది. పెద్ద పెద్ద బ్యానర్లలో చేసిన సినిమాలు కూడా ఫ్లాపులుగానే మిగిలాయి. ఇప్పుడు రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తిరగబడరా సామి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయింది. రాజ్ తరుణ్ తనకు ఏ మాత్రం సూటవ్వని మాస్ సినిమాను తీస్తున్నాడని కామెంట్స్ వచ్చాయి.
ఆ సినిమాకు బజ్ రాని టైమ్ లో రాజ్ తరుణ్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన వివాదం ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమైంది. తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ పై కేసు పెట్టింది. అంతేకాదు తిరగబడరా సామి హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడని కూడా ఆరోపించింది. రాజ్ తరుణ్ కూడా ఆమెపై ఆరోపణలు చేశాడు. దీంతో తిరగబడరా సామి హీరోయిన్ మాల్వి, లావణ్య మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయంపై మీడియాలో రచ్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తిరగబడరా సామి సినిమాకు బజ్ ఏర్పడుతుంది. మరి ఈ బజ్ సినిమాకు ఏ మేర పనికొస్తుందో చూడాలి.