మునుగోడు బైపోల్ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు అక్రమాలకు పాల్పడుతూ, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్ ఈసీకి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా బుద్ధ భవన్ ముందుకు మౌన దీక్షకు దిగారు. మునుగోడు ఉపఎన్నికలో విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరైతే మునుగోడులోనే వుంటూ ప్రచారాలు నిర్వహిస్తున్నారని, ఫైర్ అయ్యారు. నేతలందరూ ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేసస్తున్నారని కోదండ రాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.