తిరుప్పావై – గోపాలుని పూజించుటకై చెల్లెలిని మేలుకొలుపుతూ పాడిన పాశురం.

తిరుప్పావై – 12వ పాశురము
బ్రహ్మశ్రీ కంభంపాటి నాగఫణిశర్మ గారి తెలుగు అనువాదముతో
కనైత్తిళం కత్తెరుమై కన్రుక్కిరంగి
నినైత్తుములై వళియే నిన్రుపాల్ శోర,
ననైత్తిల్లమ్ శేరాక్కుమ్ నర్చెల్వన్తంగాయ్
పనిత్తెలైవీళ నిన్వాశల్ కడైపత్తి
చ్చినత్తినాల్ తెన్నిలజ్ఞ్గైక్కోమానై చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తా నెళున్దిరాయ్ ఈదెన్న పేరుఱక్కమ్
అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్
తాత్పర్యము…
’లేగదూడలు గల గేదెలు పాలుపితుకువారు లేక తమ దూడలను తలంచుకొని వానిపై మనసు పోవుటచే ఆ దూడలే వచ్చి పొదుగులో మూతి పెట్టినట్లు తోచి పాలు పొదుగునుండి కారిపోవుటచే యిల్లంతయు బురద యగుచున్న యొకానొక మహైశ్వర్యసంపన్నుని చెల్లెలా ! మంచు తలపై పడుచుండ నీ వాకిట నిలిచి యుంటిమి. మీ యింటి ద్వారపు పైకమ్మిని పట్టుకొని నిలిచియుంటిమి. కోపముతో దక్షిణదిక్కున నున్న లంకకు అధిపతియైన రావణుని చంపిన మనోభిరాముడగు శ్రీరాముని గానము చేయుచుంటిమి. అది వినియైనను నీవు నోరు విప్పవా ! ఇంక మమ్మేలుకొనవా ! ఏమి యీ గాఢనిద్ర ! ఊరివారి కందరకును నీ విషయము తెలిసిపోయినది. లెమ్ము’ అని కృష్ణుని విడువక సర్వకాలములనుండుటచే స్వధర్మమునుకూడ చేయలేని దశయందున్న ఐశ్వర్యసంపన్ను డగ్ ఒక గోపాలుని చెల్లెలిని మేల్కొలిపినాడు.!!
మీ
నందగోపాలమోహనవంశీకృష్ణశర్మ బిదురు

Related Posts

Latest News Updates