తిరుప్పావై – 9వ పాశురము
బ్రహ్మశ్రీ కంభంపాటి నాగఫణిశర్మ గారి తెలుగు అనువాదముతో
తూమణి మాడత్తుచ్చుత్తమ్ విళక్కెరియ
తూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్
మామాన్ మగళే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
మామీర్! అవళై యెళుప్పీరో! ఉన్ మగళ్ దాన్
ఊమైయో ? అన్రిచ్చెవిడో ? అనన్దలో
ఏ మప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో ?
“మామాయన్ మాధవన్ వైగున్దన్” ఎన్రెన్రు
నామమ్ పలవుమ్ నవిన్రేలో రెమ్బావాయ్!
తాత్పర్యము…
పరిశుద్ధములగు నవవిధమణులతో నిర్మించబడిన మేడలో సుఖశయ్యపై చుట్టును దీపములు వెల్గుచుండగా అగరుధూపము గుమగుమలాడుచుండగా నిద్రపోవుచున్న ఓ అత్తకూతురా! మణికవాటపు గడియ తీయుము. ఓ యత్తా! నీవైననూ ఆమెను లేపుము. నీ కుమార్తె మూగదా? లేక చెవిటిదా? లేక జాడ్యము గలదా? లేక ఎవరైన కదలిన ఒప్పమని కావలియున్నారా? లేక గాఢనిద్ర పట్టునట్లు మంత్రించినారా? “మహామాయావీ! మాధవా! వైకుంఠవాసా!” అని అనేక నామములను కీర్తించి ఆమె లేచునట్లు చేయుము.!!
మీ
నందగోపాలమోహనవంశీకృష్ణశర్మ బిదురు