ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు ఐపీఎస్ లకు పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఐడీ చీఫ్ గా వున్న పీవీ సునీల్ కుమార్, కేంద్ర సర్వీసులో వున్న అమిత్ గార్గ్, మహేశ్ దీక్షిత్ కు డీజీపీలుగా ప్రమోషన్ లభించింది. ఇకపై… పీవీ సునీల్ కుమార్ డీజీపీ హోదాలో సీఐడీ చీఫ్ గా పనిచేయనున్నారు.













