చిక్కుల్లో నయనతార దంపతులు.. సరోగసిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన తమిళ సర్కార్

నయనతార దంపతులు చిక్కుల్లో పడ్డారు. సరోగసీ విధానం ద్వారా వారు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. అయితే.. సరోగసీ ద్వారా పిల్లల్ని కనే సమయంలో సరైన విధి విధానాలు పాటించారా? లేదా? అన్న అంశాన్ని తేల్చాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందు కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ త్రిసభ్య కమిటీని నియమించింది. వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని త్రిసభ్య కమిటీకి ప్రభుత్వం సూచించింది. అవసరమైతే నయనతార, విఘ్నేష్ దంతపులను కూడా ఈ త్రిసభ్య కమిషన్ విచారించనుంది. ఒకవేళ నిబంధనలు తుంగలో తొక్కి… సరోసగీ చేసుకున్నారని నిరూపితమైతే.. నయన్ తారకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించే ఛాన్స్ వుంది.

 

 

నయనతార-విఘ్నేశ్​ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. తమకు ఇద్దరు మగ పిల్లలు(కవలలు) జన్మించారంటూ ఇటీవలే సోషల్​మీడియా ద్వారా తెలిపారు. అయితే దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఎందుకంటే వీరికి పెళ్లై ఇంకా నాలుగు నెలలే అవుతోంది. అందులోనూ వీరు సరోగసి ద్వారా తల్లిదండ్రులు అయ్యారు. దీంతో వారిద్దరిపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. అలాగే తమకు పిల్లలు ఎలా పుట్టారో వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం నయన్ దంపతులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఇప్పటివరకు ఈ జంట స్పందించలేదు.

Related Posts

Latest News Updates